Fleeting Dreams
కారణం ఏదైనా కలిసి రాని కాలం ముందు కనుమరుగయ్యే కలల ప్రపంచం
క్షణికావేశం లో తలకిందులయ్యే జీవితం
మార్చలేని గతం
మరుగున పడిపోయిన జీవన గమనం
గుర్తురాని క్షణాలెన్నో గతంలో
మరువలేని జ్ఞాపకాలెన్నో
నడి మధ్య ఊగిసలాడే మనసుకి నిలకడేది
నిర్వీర్యమైన బతుకు సమరానికి ఊపిరేది