Shall We ask time to Pause for a moment?
ఆగమందామా, కాసేపు కాలాన్ని?
మన మనసు చెప్పే వేల కారణాల వెల్లువలో విశ్రమించడానికి
సహాయం కోరదామా,
అంతం లేని, ఆలోచనలలో అర్థం వెతకడానికి?
ప్రాధేయపడదామా,
ఈ క్షణం మనదని కాదేమోనని, మునుముందు ఇంకేదో మంచి జరగాలని?
ఓదార్పు కోరదామా,
మన జీవితంలో అటుపోటులన్నీ మన ప్రమేయం లేకుండా వచ్చాయని, మనమే బాధితులమని?
వేడుకుందామా,
ఉనికి కోల్పోయిన ఆశలో, శ్వాస నింపమని?
కనికరించమందామా,
ఎవరికోసమో ఆగని కాలాన్ని, మన కోసం ఆగమని? మన తప్పే లేకుండా మన దారి దయనీయమైందని?
చేయి పట్టి నడిపించమందామా,
మన అడుగులు తప్పటడుగులుగా మారాయని, అది ఎలా జరిగిందో తెలియదని?
మనం గాలిలో దీపం పెట్టామని, నువ్వే దిక్కు అని
చేతులు జోడించి జీవితాన్ని వదిలేద్దామా?